24June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తెలంగాణలోని భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్ బదిలీలు జరగడంతో పాలనపరంగా ప్రక్షాళనను ప్రభుత్వం ప్రారంభించిందని భావించాలి.

Update: 2024-06-24 13:10 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలోని భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్ బదిలీలు జరగడంతో పాలనపరంగా ప్రక్షాళనను ప్రభుత్వం ప్రారంభించిందని భావించాలి.

Chandrababu : వాళ్లకు అదిరిపోయే న్యూస్.. రేపు చంద్రబాబు గుడ్‌న్యూస్ ప్రకటనకు రెడీ అయిపోయారట

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంత ప్రజలకు వరాలు ప్రకటించాలని రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించిన ప్రకటన రేపు వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రచారం పెద్దయెత్తున నడుస్తోంది. కుప్పం నియోజకవర్గం ప్రజలకు వరాలు ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారట.

BRS : కారు పార్టీ ఖాళీ అవుతుందా? లోకల్ బాడీ ఎన్నికలకు ముందే క్లీన్ చేసేస్తారా?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డురోజులే ఎదురవుతున్నాయి. ఎంత మంది ఉంటారో తెలియదు. ఎవరు వెళతారో కూడా ఉప్పందడం లేదు. నమ్మకంగా ఉన్న నేతలే పార్టీని వీడి వెళుతున్నారు. ఒక్క ఓటమితో పరిస్థితుల్లో ఇంత మార్పులు చోటు చేసుకుంటాయని గులాబీ పార్టీ నేతలు అస్సలు ఊహించలేదు.

Andhra Pradesh : జులై 1న ఇంటివద్దకే పింఛను.. గుడ్ న్యూస్ చెప్పిన కేబినెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. జులై ఒకటోతేదీ నుంచి పెంచిన పింఛనును అమలు చేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. జులై నుంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛను చెల్లించనున్నారు.

Ys Jagan : ఇప్పటికైనా తెలిసి వచ్చిందా..? ఓపెన్ అయిపోతున్న వైసీపీ నేతలు.. చెబుతున్నవి చెవికెక్కితున్నాయా బాసూ?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వైసీపీ నేతలు నేరుగా చెబుతున్నారు. బహిరంగంగానే వారు ఓటమికి గల కారణాలను చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు నేరుగా చెప్పే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నారు. ఇంత దారుణ ఓటమిని ఎవరూ ఊహించలేదు.

Breaking : సుప్రీంకోర్టులోనూ కేజ్రీవాల్ కు నిరాశ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు.

Parliament : స్పీకర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం... మోదీ సభ్యుడిగా ప్రమాణం

పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా నరేంద్ర మోదీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 18 వ లోక్ సభలో తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తర్వాత వరసగా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Telangana : తెలంగాణకు "డెంగీ" ముప్పు.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తెలంగాణకు డెంగీ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వాతావరణం మార్పులతో డెంగీ వ్యాధి తెలంగాణలో విస్తరించే అవకాశముందని తెలిపింది. గతంలో కంటే కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశాలున్నాయని, అందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

Nara Lokesh : మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలను ఈరోజు చేపట్టారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ రూమ్ నెంబరు 208లో ఆయన కొద్దిసేపటి క్రితం బాధ్యతలను స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సన్నిహితుల తో కలసి ఆయన తన చాంబర్ లోకి అడుగుపెట్టారు.

Telangana : నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News