Cyclone Alert : వాయుగుండం పొంచి ఉంది.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్

ఆంధ్రప్రదేశ్ కు రేపు మరో వాయుగుండం పొంచి ఉంది. ప్రస్తుతం ఉత్తర ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది.

Update: 2024-10-21 03:36 GMT

ఆంధ్రప్రదేశ్ కు రేపు మరో వాయుగుండం పొంచి ఉంది. ప్రస్తుతం ఉత్తర ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది.దీని ప్రభావంతో ఈరోజు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22వ తేదీ ఉదయం నాటికి వాయుగుండం గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

వాయుగుండంగా మారి...
వాయుగుండంగా మారిన తర్వాత, ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24వ తేదీ ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్ 24,25 తేదీల్లో ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని, అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ఈ జిల్లాలపై ప్రభావం...
ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఇప్పటికే సముద్రంలోకి వేటకువెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని అధికారులు తీర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలతో పాటు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, మరికొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. మొన్నటితరహాలోనే ప్రభుత్వం ఈసారి కూడా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. అధికారులను సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
"దానా" గా పేరు..
పొంచి ఉన్న తుపాను పేరు ‘దానా తా నిర్ణయించారు. ఈ పేరు కతార్‌ దేశం సూచించింది. దీని అర్ధం ముత్యం. తుపాను తీరం దాటే సమయంలో గాలి వేగం 100 నుంచి 120 కిలోమీటర్లుగా ఉంటుందని దాస్‌ ప్రాథమిక అధ్యయనం మేరకు చెప్పారు. ఉత్తరఅండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం ఉదయం అల్పపీడనంగా మారనుంది. 22న వాయుగుండంగా బలం పుంజుకుంటుంది. ఈ నెల 23న ఇది తుపానుగా మారనుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం తెలిపింది. తుపానుగా మారిన తరువాత ఈ విపత్తు ఉత్తర పశ్చిమ దిశగా ఒడిశాకు చేరువై 24 ఉదయం తీరం దాటనుందన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం బాలేశ్వర్, పశ్చిమబెంగాల్‌ తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News