లక్ష్మణ్ అత్యుత్తమ జట్టులో చోటు వీరికే..!

Update: 2018-08-30 08:12 GMT

భారత క్రికెట్ లో హైదరాబాదీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రత్యేకించి టెస్టు క్రికెట్ లో లక్ష్మణ్ ఎన్నో మంచి ఇన్నింగ్స్ లను భారత్ కు విజయాలను అందించాడు. ఇప్పుడు లక్ష్మణ్ 25 ఏళ్లలో భారత అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టును ప్రకటించాడు. అంటే, లక్ష్మణ్ ఉద్దేశ్యం ప్రకారం ఈ టీమ్ అత్యుత్తమమైనదిగా భావించాడు. కాగా, ఈ జట్టుకు సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీగా బాధ్యతలు అప్పగించాడు లక్ష్మణ్. గంగూలీ కెప్టన్సీలో లక్ష్మణ్ ఎక్కువకాలం భారత జట్టులో ఉన్న విషయం తెలిసిందే. సెహ్వాగ్, మురళీ విజయ్ లను ఓపెనర్లుగా లక్ష్మణ్ ఎంచుకున్నాడు. ఇక బౌలింగ్ లో పేస్ కి ప్రాధాన్యత ఇచ్చిన ఆయన రిటైరైన జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ తో పాటు ప్రస్తుత బౌలర్ భువనేశ్వర్ కుమార్ కి అవకాశం ఇవ్వడం గమనార్హం.

లక్ష్మణ్ అత్యుత్తమ టెస్టు జట్టు

వీరేంద్ర సెహ్వాగ్(ఓపెనర్), మురళీ విజయ్(ఓపెనర్), రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ(కెప్టెన్), ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), అనీల్ కుంబ్లే, భువనేశ్వర్ కుమార్, జవగళ్ శ్రీనాథ్ జహార్ ఖాన్.

Similar News