ప్రెసిడెంట్ రూల్ దిశగా…..

కర్ణాటక శాసనసభలో గత కొంతకాలంగా చోటు చేసుకున్న హైడ్రామాకు తెరదించే ప్రయత్నాన్ని గవర్నర్ వాజుబాయివాలా చేపట్టారు. ఈరోజు కుమారస్వామి బలపరీక్షకు దిగకుంటే స్వయంగా గవర్నర్ వాజూబాయి వాలా [more]

Update: 2019-07-22 04:45 GMT

కర్ణాటక శాసనసభలో గత కొంతకాలంగా చోటు చేసుకున్న హైడ్రామాకు తెరదించే ప్రయత్నాన్ని గవర్నర్ వాజుబాయివాలా చేపట్టారు. ఈరోజు కుమారస్వామి బలపరీక్షకు దిగకుంటే స్వయంగా గవర్నర్ వాజూబాయి వాలా రంగప్రవేశంచేసే అవకాశముంది. ఇప్పటికే కర్ణాటక శాసనసభ సమావేశాలను పరిశీలించేందుకు ఇద్దరు ఉన్నతాధికారులను సభకు పంపారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఈరోజు బలపరీక్ష జరగాలని పట్టుబడుతోంది. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు మరో సంకేతాన్ని ఆ పార్టీ నేతలు పంపారు. తిరిగి పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ కు వస్తుందని సమాచారాన్ని పంపింది. ఈ మేరకు జనతాదళ్ ఎస్ కూడా అంగీకరించిందని మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. మరోరోజు బలపరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు విప్ పై స్పష్టత ఇవ్వాలంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈరోజు బలపరీక్షకు కుమారస్వామి దిగకుంటే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది

Tags:    

Similar News