Breaking : రాహుల్ పై అనర్హత వేటు
రాహుల్ గాంధీపై అనర్హత వేటు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని ప్రకటించింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని ప్రకటించింది. నిన్న సూరత్ కోర్టు వేసిన రెండేళ్లు జైలు శిక్షతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినట్లు తెలిపింది. లోక్ సభ ప్రజాప్రాతినిథ్యం చట్టం ప్రకారం రెండేళ్లు, ఆ పైన శిక్ష పడితే అనర్హత వేటు వేసే అవకాశముంది. కోర్టు తీర్పు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలకే నిర్ణయం తీసుకుంది.
రెండేళ్లు జైలు శిక్ష...
కర్ణాటకలో 2019లో మోదీని దూషించిన కేసులో సూరత్ కోర్టు నిన్న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనువెంటనే బెయిల్ కూడా ఇచ్చింది. రెండేళ్లు జైలు శిక్ష పడటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెలువడుతుందని ముందే తెలుసుకున్న విపక్షాలు ఈరోజు పార్లమెంటుకు నిరసనగా బయలుదేరాయి. ఆందోళనకు దిగాయి. అనుకున్నట్లుగానే రాహుల్ గాంధీని వాయల్పాడ్ ఎంపీగా ఇక ఉండరని స్పష్టం చేసింది.