అందుకే లోకేష్‌ క్లారిటీ ఇచ్చారా..?

‘మేము అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడుగారే ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు’ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. తద్వారా ‘ఐదేళ్లూ మనదే పూర్తి స్థాయి అధికారం’ అని తెలుగుదేశం కార్యకర్తలకు, ముఖ్య పదవిపై ఆశలు పెట్టుకోవద్దని జనసైనికులకు... లోకేష్‌ ఓ స్పష్టమైన మెసేజ్‌ను పంపించారు. తెలుగుదేశం, జనసేన మధ్య జరగబోయే చర్చల్లో ముఖ్యమంత్రి ఎవరనే అంశమే ప్రస్తావనకు రాకుండా చేశారు.

Update: 2023-12-25 05:46 GMT

 Lokesh clarifies on CM post

‘మేము అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడుగారే ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు’ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. తద్వారా ‘ఐదేళ్లూ మనదే పూర్తి స్థాయి అధికారం’ అని తెలుగుదేశం కార్యకర్తలకు, ముఖ్య పదవిపై ఆశలు పెట్టుకోవద్దని జనసైనికులకు... లోకేష్‌ ఓ స్పష్టమైన మెసేజ్‌ను పంపించారు. తెలుగుదేశం, జనసేన మధ్య జరగబోయే చర్చల్లో ముఖ్యమంత్రి ఎవరనే అంశమే ప్రస్తావనకు రాకుండా చేశారు.

‘రాష్ట్రానికి సమర్థుడైన, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలని పవన్‌ కళ్యాణ్‌ కూడా చాలాసార్లు అన్నారం’టూ పవన్‌ ఓటు కూడా చంద్రబాబుకే అని లోకేష్‌ తెలివిగా మాట్లాడారు. గతంలో జనసైనికులంతా బహిరంగ సభల్లో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతుంటే అంటూ ‘సీఎం’ అంటూ అరిచేవారు. పవన్‌ కూడా ముసి ముసి నవ్వులు నవ్వేవారు. వారాహి యాత్ర జరుగుతున్నప్పుడు ‘నాకూ సీఎం కావాలని ఉంది’ అని ఆయన అన్నారు. తెలుగుదేశంతో పొత్తు తర్వాత ‘ముఖ్యమంత్రి పదవిపై తమ కూటమి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇలా జనసేనకు పదవులపై కొంత ఆశ ఉండేది. కానీ లోకేష్‌ మాత్రం ఎలాంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టారు.

జనసేన గెలుపు అవకాశాలపై తెలుగుదేశం శ్రేణుల్లో చాలా సందేహాలున్నాయి. ఇతర పార్టీల్లా జనసేనకు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేదు. నియోజకవర్గం స్థాయిలో నాయకులుగా చలామణి అవుతూ, ఎమ్మెల్యే సీటుపై ఆశలు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వార్డు నుంచి పై స్థాయి దాకా వివిధ అంచెల్లో పదవులూ లేవు. బాధ్యతగా ఉండే నాయకులూ లేరు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఎక్కువ సీట్లు ఇచ్చినా, అవన్నీ ఓడిపోయే ఖాతాలో చేరుతాయని చంద్రబాబు అండ్‌ కో భావిస్తున్నారు. తాము ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే, పవన్‌ బలం కూడా తమకు కలిసి, గెలుపు అవకాశాలుంటాయని తెదేపా ఆలోచన. అందుకే జనసేనకు 25 సీట్లు కంటే ఇచ్చేది లేదని ఆ పార్టీ చెబుతోంది. 15 నుంచి 20 శాతం స్థానాల్లో పోటీ చేసే పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం కుదరదని లోకేష్‌ ఘంటాపథంగా చెబుతున్నారు. దీనిని సమర్థత, అనుభవం లాంటి పదాలతో కవర్‌ చేస్తున్నారు. ఆయన క్లియర్‌గానే ఉన్నారు. ఇప్పుడే జనసైనికులకు కూడా క్లారిటీ వచ్చినట్లుంది.

Tags:    

Similar News