చంద్రగ్రహణం ఎప్పుడు, ఎలా చూడొచ్చంటే..!

ప్రపంచంలోని వివిధ టైమ్ జోన్‌‌ల ప్రకారం మే 15, 16 తేదీల్లో గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం దక్షిణ, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, హిందూ

Update: 2022-05-14 09:05 GMT

ఆకాశంలో మరో అద్భుతం చూడడానికి సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడగా.. ఇప్పుడు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 16వ తేదీన బుద్ధ పూర్ణిమ నాడు ఏర్పడనుంది. ఈ ఏడాది సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.. అయితే భారత్‌లో మాత్రం ఇది కనిపించదు. ప్రపంచంలోని వివిధ టైమ్ జోన్‌‌ల ప్రకారం మే 15, 16 తేదీల్లో గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం దక్షిణ, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, హిందూ మహాసముద్రంలోని ప్రాంతాలు, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని దీవులు, దక్షిణ అమెరికా మొత్తం, ఉత్తర అమెరికాలో చాలా వరకూ కనిపించనుందని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం, చంద్రగ్రహణం కాల వ్యవధి 1 గంట 24 నిమిషాలు. ఇది మే 16, సోమవారం 07:59కి ప్రారంభమై 10:23కి ముగుస్తుంది. ఉత్తర, దక్షిణ అమెరికాలోని అన్ని దేశాల్లోనూ, పశ్చిమ ఆఫ్రికాలోని ఎక్కువ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని.. మొత్తం 3.27 గంటల కొనసాగే ఈ గ్రహణ కాలంలో 1.25 గంటల పాటు చంద్రుడ్ని పూర్తిగా భూమి నీడ కప్పివేస్తుందని నాసా తెలిపింది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. చంద్రుడు సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్‌గా పిలుస్తారు.


చంద్రుడి మట్టితో వ్యవసాయం :

అమెరికాలోని ఫ్లోరిడా పరిశోధకులు చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలు పెంచి విజయం సాధించారు. భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి కోరికకు ఇది అదిపెద్ద ముందడుగుగా చెప్పవచ్చు. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని 'రెగోళిత్'గా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. అమెరికా ప్రయోగించిన అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి అడుగుపెట్టిన అప్పటి శాస్త్రవేత్తలు ఈ 'రెగోళిత్'ను భూమికి తీసుకువచ్చారు. పలు పరీక్షలు చేసి వ్యవసాయం చేయవచ్చని తెలుసుకున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే వారికోసం లేదా వ్యోమగాములు కోసం ఆహార వనరులను అభివృద్ధి చేయడానికి ఈ రకంగా ఇతర గ్రహాలపై ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి నాసా ఎలా పనిచేస్తుందో కూడా ఈ ప్రాథమిక మొక్కల పెరుగుదల పరిశోధన ఒక ముఖ్య ఉదాహరణగా చెప్పుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై మట్టి.. అగ్నిపర్వత బూడిద ఉండడంతో అది నిస్సారవంతమైన మట్టిగా భావించారు.. వాటిలో మొక్కలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోయారు. అయితే గత కొన్నేళ్లుగా జరిపిన పరీక్షల ఆధారంగా.. ఒక నియంత్రిత వాతావరణంలో గాలి, వెలుతురు, నీరుని నియంత్రిత పద్దతిలో అందించడం ద్వారా చంద్రుడి రెగోళిత్ పై మొక్కలు విజయవంతంగా పెంచగలిగినట్టు ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో హార్టికల్చరల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ రాబర్ట్ ఫెర్ల్ స్పష్టం చేశారు.

వ్యవసాయ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి నాసా ఎలా పనిచేస్తుందో కూడా ఈ ప్రాథమిక మొక్కల పెరుగుదల పరిశోధన ఒక ముఖ్య ఉదాహరణగా చెప్పుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై మట్టి.. అగ్నిపర్వత బూడిద ఉండడంతో అది నిస్సారవంతమైన మట్టిగా భావించారు.. వాటిలో మొక్కలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోయారు. అయితే గత కొన్నేళ్లుగా జరిపిన పరీక్షల ఆధారంగా.. ఒక నియంత్రిత వాతావరణంలో గాలి, వెలుతురు, నీరుని నియంత్రిత పద్దతిలో అందించడం ద్వారా చంద్రుడి రెగోళిత్ పై మొక్కలు విజయవంతంగా పెంచగలిగినట్టు ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో హార్టికల్చరల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ రాబర్ట్ ఫెర్ల్ స్పష్టం చేశారు. 

Tags:    

Similar News