రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది... దిగిపొమ్మంటే దిగిపోతా
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపొమ్మంటే ఇప్పుడే దిగిపోతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపొమ్మంటే ఇప్పుడే దిగిపోతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. మహారాష్ట్ర ప్రజల నుద్దేశించి థాక్రే మాట్లాడారు. ప్రభుత్వం సంక్షోభంలో పడటానికి కారణాలను ఆయన పూర్తిగా ప్రజలకు వివరించారు. ఈరోజు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు. తనకు కోవిడ్ పాజిటివ్ ఉన్నా ఎలాంటి లక్షణాలు లేవన్నారు. చెప్పేందుకు చాలా మాటలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి పదవిని నిజాయితీగా నిర్వర్తించానని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. శివసేన చీఫ్ గా దిగిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను ఏ తప్పు చేయలేదన్నారు. సొంత పార్టీ నేతలే తనను వ్యతిరేకించడంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. తాను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలని ఉద్దవ్ థాక్రే కోరారు.
ఎన్నికలకు వెళ్లి మళ్లీ ....
దేశంలో టాప్ 5 ముఖ్యమంత్రుల్లో మహారాష్ట్ర సీఎం ఉన్నారన్నారు. హిందుత్వ గురించి చాలా మాట్లాడుతున్నారని, ప్రజలను కలవడం లేదన్న అసత్య ప్రచారాన్ని కొందరు చేస్తున్నారన్నారు. శివసేన హిందుత్వ వదిలేసిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. కానిహిందుత్వ శివసేన కలిసే ఉన్నాయని చెప్పారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్, ఎన్సీపీతో తాను చాలా ఏళ్లు పోరాటం చేశానని చెప్పారు. సోనియా గాంధీ కూడా తనతో అప్పుడప్పుడు మాట్లాడతారని చెప్పారు. కమల్‌నాధ్, శరద్ పవార్ తనతో మాట్లాడరని, తన వెంటే ఉంటారని చెప్పారన్నారు. ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాను నమ్మక ద్రోహానికి గురయ్యానని ఆయన అన్నారు. శివసైనికుడు ఎవరైనా సీఎం కావచ్చని చెప్పారు.
శివసేనను మోసం చేసిందెవరు?
ముఖ్యమంత్రిగా తన పరిపాలనలో అందరూ సహకరించారని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ తమ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని, అయినా తనకు పాలనతో మాత్రం పూర్తి సహకారం అందించారని ఉద్దవ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా తాను అందరితో మాట్లాడనని, కానీ తాను బాత్ రూమ్ కు వెళ్లినా అనుమానించారన్నారు. సూరత్ వెళ్లి ఎందుకు మాట్లాడాలని ఆయన ప్రశ్నించారు.శివసేనను మోసం చేయనంటూ చేస్తున్నదేందంటూ ఆయన షిండేను పరోక్షంగా ప్రశ్నించారు. ఉద్ధవ్ సీఎంగా వద్దు అంటే ఇప్పుడే రాజీనమా చేస్తానని, రాజీనామా లేఖను కూడా సిద్ధం చేస్తానని చెప్పారు. సీఎం పదవి కోసం తాను పాకులాడటం లేదన్నారు.ఊహించకుండానే తనకు సీఎం పదవి వచ్చిందన్నారు. ట్విట్టర్, ట్రోలింగ్ లకు తాను స్పందించనని చెప్పారు. ఎమ్మెల్యేలు కోరుకుంటే తాను రాజీనామాకు సిద్ధమని చెప్పారు.