మహేష్ బాబు ఎందుకు ఊరుకుంటారు?
జీఎస్టీ కమిషనర్ కు సీనీ హీరో మహేష్ బాబు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనను సంప్రదించకుండా కోర్టు పరిధిలో ఉన్న బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడంపై ఆయన [more]
జీఎస్టీ కమిషనర్ కు సీనీ హీరో మహేష్ బాబు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనను సంప్రదించకుండా కోర్టు పరిధిలో ఉన్న బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడంపై ఆయన [more]
జీఎస్టీ కమిషనర్ కు సీనీ హీరో మహేష్ బాబు లీగల్ నోటీసులు ఇచ్చారు. తనను సంప్రదించకుండా కోర్టు పరిధిలో ఉన్న బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. చట్టప్రకారం అన్ని పన్నులు చెల్లించామన్నారు. చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని తెలిపారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. తాను ప్రతి ఏటా ట్యాక్స్ లను సక్రమంగా చెల్లిస్తున్నానని ఆయన తెలిపారు. 2007-2008 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని జీఎస్టీ కమిషనర్ చెబుతున్నారు. వడ్డీలు, పన్ను, జరిమానా రూపంలో మొత్తంగా 73.5 లక్షలు చెల్లించాలని ఆయన అంటున్నారు. మహేష్ బాబు యాడ్స్ లో నటించి అందుకు సంపాదించిన సొమ్ముపై ట్యాక్స్ ను మహేష్ బాబు చెల్లించలేదన్నది జీఎస్టీ కమిషనర్ ఆరోపణ. దీనికి ప్రతిగా మహేష్ బాబు ఆయనకు లీగల్ నోటీసులు పంపారు.