పశ్చిమ బెంగాల్ లో హైడ్రామా..! కలకత్తా వెళ్లనున్న బాబు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి దిగారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ లో నోటీసులకు స్పందించని కలకత్తా పోలీస్ కమిషనర్ ను [more]

Update: 2019-02-04 05:59 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి దిగారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ లో నోటీసులకు స్పందించని కలకత్తా పోలీస్ కమిషనర్ ను విచారించేందుకు వెళ్లిన సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు కేంద్రం తమపై కక్ష సాధిస్తోందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ నిన్న రాత్రి నుంచి దీక్షకు దిగారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆమె దీక్ష చేస్తున్నారు. దీక్షకు మద్దతుగా బెంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల కన్నా దయనీయంగా పరిస్థితి ఉందని, అజీత్ దోవల్ సీబీఐకి ఆదేశాలు ఇచ్చి మరీ పశ్చిమ బెంగాల్ కు పంపించారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ నే అరెస్టు చేయాలనుకోవడం ఎంత ఎంత దుస్సాహాసం అని ప్రశ్నించారు. కేంద్రంపై తన పోరాటం కొనసాగుతుందని, ఎన్నాళ్లైనా సత్యాగ్రహం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.

సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

ఇదిలా ఉండగా బెంగాల్ లో తమ అధికారులను అరెస్టు చేయడం పట్ల సీబీఐ సీరియస్ అయ్యింది. న్యాయ నిపుణులతో చర్చించిన సీబీఐ.. ఇవాళ సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది. తమ విచారణకు సహకరించేలా బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇక, మమతా బెనర్జీపై కేంద్రం కక్ష సాధిస్తోందని, సీబీఐ చర్యలు దుర్మార్గమని ఆరోపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలకత్తా వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మమతా బెనర్జీకి సంఘీభావం తెలుపనున్నారు.

Tags:    

Similar News