చంద్రబాబుకు గుణపాఠం చెబుతాం

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే సహించమని, చంద్రబాబుకు రాజకీయ గుణపాఠం చెబుతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణమాది పేర్కొన్నారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు [more]

Update: 2019-02-23 08:28 GMT

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే సహించమని, చంద్రబాబుకు రాజకీయ గుణపాఠం చెబుతామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణమాది పేర్కొన్నారు. దళితులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు వెనకేసుకురావడం, దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని వ్యాఖ్యానించిన చంద్రబాబు తీరును చూస్తే దళితుల పట్ల చంద్రబాబుకు ఉన్న అభిప్రాయం స్పష్టమవుతుందన్నారు. ఇటీవలి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి అనుచరిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి చింతమనేనిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News