రేవంత్ పాదయాత్ర 10 నుంచే…?

కాంగ్రెస్ ముఖ్యనేతలతో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ సమావేశమయ్యారు. పార్టీ కార్యాచరణను ప్రకటించనున్నారు. కొత్త గా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీని [more]

;

Update: 2021-07-08 06:01 GMT

కాంగ్రెస్ ముఖ్యనేతలతో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ సమావేశమయ్యారు. పార్టీ కార్యాచరణను ప్రకటించనున్నారు. కొత్త గా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీని మరింత పరుగులు పెట్టించాలని మాణికం ఠాకూర్ భావిస్తున్నారు. వచ్చే రెండు నెలల పాటు పార్టీ కార్యక్రమాలు ఎలా ఉండాలన్న దానిపై చర్చించనున్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యను హైలెట్ చేయాలని, ఇందుకోసం అవసరమైతే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకూ రేవంత్ రెడ్డి పాదయాత్ర జరిగే అవకాశముందంటున్నారు. మాణికం ఠాకూర్ ఈరోజ ప్రకటించే అవకాశముంది. ఈ సమావేశానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు కీలక నేతలు హాజరయ్యారు.

Tags:    

Similar News