కిడ్నాప్ అయినా.. భర్తతోనే…?
వికారాబాద్ జిల్లా కేంద్రం లో సినీఫక్కీలో జరిగిన వివాహిత కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. 3 రోజులు పాటు ఇటు పోలుసులు అటు కుటుంబ సభ్యులను ముప్పు [more]
వికారాబాద్ జిల్లా కేంద్రం లో సినీఫక్కీలో జరిగిన వివాహిత కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. 3 రోజులు పాటు ఇటు పోలుసులు అటు కుటుంబ సభ్యులను ముప్పు [more]
వికారాబాద్ జిల్లా కేంద్రం లో సినీఫక్కీలో జరిగిన వివాహిత కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది. 3 రోజులు పాటు ఇటు పోలుసులు అటు కుటుంబ సభ్యులను ముప్పు తిప్పలు పెట్టిన కేసు , ఎట్టకేలకు ఛేదించారు. ఇష్టపూర్వకంగా తన భర్త తో వెళ్లిపోయినట్లు గుర్తించారు పోలుసులు.. దీంతో వికారాబాద్ కి తరలించి దీపికా, అఖిల్ అలియాస్ ఖలీల్ ను విచారణ చేశారు పోలుసులు.
మూడు రోజుల క్రితం కిడ్నాప్….
మూడు రోజులు క్రితం వికారాబాద్ నడి బొడ్డున జరిగిన కిడ్నాప్ డ్రామాకు పోలీసులు తెరదించారు. ఆదివారం సాయంత్రం అక్క చెలెళ్లు ఇద్దరు కలిసి షాపింగ్ కోసం బయటకి వచ్చారు.. అయితే షాపింగ్ ముగించుకొని తిరిగి వెళుతుండగా కారులో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చెల్లెలు దీపికా ను కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీంతో వెంటనే పోలీసులు కి సమాచారం అందించడం తో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులు పాటు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివాహిత కోసం గాలించారు.
మతాంతర వివాహం కావడంతో….
2016 లో ఖలీల్ అనే యువకుడు తో దీపికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు…దీపికా ను పెళ్లి చేసుకున్నాక అఖిల్ గా పేరు మార్చుకున్నాడు.. అయితే మతాంతర వివాహం కావడంతో యువతి తల్లిదండ్రులు ప్రేమ వివాహన్ని వ్యతిరేకించారు.. దీంతో గత కొద్ది రోజుల నుండి భర్త కు దూరం గా ఉండాలని దీపికా ను బలవంతంగా వారి వద్దే పెట్టుకున్నారు తల్లిదండ్రులు.. అయితే శనివారం రోజు విడాకులు కోసం కోర్టు కి కూడా వెళ్లారు.. అయితే కోర్టు కి వెళ్లి వచ్చిన మరుసటి రోజే దీపికా కిడ్నాప్ అయింది.. దీంతో సిసి ఫుటేజ్ ఆధారంగా పోలుసులు దర్యాప్తు చేశారు.
భర్తతో కలసి ఉండాలని….
భర్తతో కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే దీపిక కారులో వెళ్లిందని పోలీసులు తేల్చారు… 48 గంటల పాటు కొనసాగిన ఉత్కఠకు తెరదించుతూ పారిపోయిన దీపిక, ఖలీల్ అలియాస్ దిలీప్ లను వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో మీడియాముందు దు ప్రవేశ పెట్టారు. వికారాబాద్ నుంచి వెళ్లిన తర్వాత హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి సిద్దిపేట్ కువెళ్లి తెలిసిన వారి వద్ద ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.. గత నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వీరిని అమ్మాయి తల్లిదండ్రుల కు పెళ్లి ఇష్టం లేక పోవడంతోనే కుటుంబీకులు బలవంతంగా విడాకులకు అఫ్లయ్ చేశారని…తనకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేకనే పారిపోయినట్లు అమ్మాయి చెప్పిందని ఎస్పీ చెప్పారు. కోర్టులో ప్రవేశ పెట్టిన అనంతరం అమ్మాయి చెప్పే స్టేట్ మెంట్ ను బట్టి విచారణ చెపటనున్నట్లు ఎస్పీ నారాయణ తెలిపారు.