మాయావతి కి షాక్ మామూలుగా లేదుగా?

ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ను శాసించిన మాయావతి ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమరుగు కాబోతున్నారు

Update: 2022-03-10 04:36 GMT

ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ను శాసించిన మాయావతి ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమరుగు కాబోతున్నారు. ఓటు బ్యాంకు మొత్తం ఇతర పార్టీలకు తరలి వెళ్లిపోయింది. దళిత, బ్రాహ్మణ ఓటు బ్యాంకు తో గతంలో అధికారంలోకి వచ్చిన మాయావతి ఈసారి మాత్రం యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపించ లేకపోయారు. కాన్షీరామ్ ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో కీలక రాజకీయపార్టీగా మారింది.

ఓటు బ్యాంకు...
కాన్షీరామ్ వారసురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టిన మాయావతి పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మాయావతి సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పెద్ద తప్పు చేశారు. తప్పును సరిదిద్దుకుని ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా తన పార్టీకి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకును మాత్రం మాయావతి రాబట్టుకోలేకపోయారు.
కాంగ్రెస్ తరహాలోనే....
ఈ ఎన్నికల్లో తొలి నుంచి మాయావతి అంత యాక్టివ్ గా కన్పించలేదు. 403 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన మాయావతి ప్రచారాన్ని కూడా సరిగా నిర్వహించలేదన్న విమర్శలున్నాయి. యూపీ బేస్ గా ఏర్పడిన ఈ పార్టీ అక్కడే నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కేవలం ఏడు స్థానాల్లోనే మాయావతి పార్టీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ కు ఏమాత్రం తీసిపోని విధంగా మాయావతి పార్టీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News