కోటి కేటుగాడి అరెస్ట్

మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతో సహా ఐదుగురిని లంచం తీసుకున్న కేసులో అరెస్ట్‌ చేశారు. నగేష్ తో పాటు [more]

Update: 2020-09-09 14:23 GMT

మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతో సహా ఐదుగురిని లంచం తీసుకున్న కేసులో అరెస్ట్‌ చేశారు. నగేష్ తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, చిల్పిచేడు ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, మధ్య వర్తిత్వం వహించిన కోలా జీవన్ గౌడ్, సర్వే ల్యాండ్ రికార్డ్ జూనియర్ అసిస్టెం్ వసీం అహ్మద్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నర్సాపురం మండలంలోని చిప్పలకుర్తిలో 113 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇచ్చేందుకు 1.40 కోట్లు లంచం డిమాండ్ చేశారు. అయితే చివరకు 1.12 కోట్లకు డీల్ కుదిరింది. రెండు దఫాలుగా 19.5 లక్షలు, 25.5 లక్షలు నగేష్ తీసుకున్నారు. మరో 72 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దీనికి బదులు నగేష్ ఐదు ఎకరాల భూమిని తన బినామీ పేరిట నగేష్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నగేష్ కు బినామీ గా జీవన్ గౌడ్ వ్యవహరించారు. బాధితుడి నుంచి నగేష్ 8 బ్లాంక్ చెక్కులను కూడా తీసుకున్నారు. ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో 28 లక్షల నగదు, అరకేజీ బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News