జగన్ తో భేటీ మామూలుగా జరగలేదు

జగన్ తో భేటీ సంతృప్తికరంగా ముగిసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2022-01-13 09:54 GMT

జగన్ తో భేటీ సంతృప్తికరంగా ముగిసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ సమస్యల పట్ల సానుకూలంగా జగన్ స్పందించారన్నారు. తాను చిత్ర పరిశ్రమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తాను చెప్పినవన్నీ జగన్ శ్రద్ధగా విన్నారని, ఆ విషయాలను కమిటీకి చెబుతానని, సానుకూల నిర్ణయం ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారని చిరంజీవి చెప్పారు.

సానుకూలంగా....
పరిశ్రమ కష్టాలు, కార్మికుల సమస్యలను వివరించానని చిరంజీవి చెప్పారు. తాను అందరి పక్షాన ఉంటానని జగన్ తనకు భరోసా ఇచ్చారన్నారు. మరోసారి తాను పిలుస్తానని, అప్పుడు సినీ పరిశ్రమ అంగీకరించిన తర్వాతనే జీవో లు విడుదల చేస్తానని చెప్పారు. ఎవరూ మాటలు జారవద్దని, సానుకూల నిర్ణయం వస్తుందని చిరంజీవి చెప్పారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. చిన్న సినిమాల సమస్యల పట్ల కూడా జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
సోదరుడిగా గుర్తించి...
తనను ఒక సోదరుడిగా పండగ పూట తనను భోజనానికి పిలవడం ఆనందంగా ఉందని, భారతి గారు తనకు వడ్డించడం మరింత సంతోషాన్ని కల్గించిందని జగన్ చెప్పారు. తనను సోదరుడిగా భావించి జగన్ ఆహ్వానించారన్నారు. ఆ కుటుంబానికి తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. వివాదానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుందని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం త్వరలోనే వస్తుందని చిరంజీవి చెప్పారు.


Tags:    

Similar News