మూడు గంటల్లో నరకమే.. అలర్ట్
తెలంగాణలో ప్రజలు రాబోయే మూడు గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది
తెలంగాణలో ప్రజలు రాబోయే మూడు గంటలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రైతులు తాము పండించిన ఉత్పత్తులను వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈదురుగాలులతో...
భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటలకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.