హైదరాబాద్ లో రోడ్డెక్కిన వలస కార్మికులు
హైదరాబాదులో వలస కార్మికులు రోడ్డెక్కారు. టోలిచౌకి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వలస కార్మికులు రోడ్డు మీదకు వచ్చారు. తమ ను సొంత గ్రామాలకు పంపించాలని డిమాండ్ చేశారు. [more]
హైదరాబాదులో వలస కార్మికులు రోడ్డెక్కారు. టోలిచౌకి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వలస కార్మికులు రోడ్డు మీదకు వచ్చారు. తమ ను సొంత గ్రామాలకు పంపించాలని డిమాండ్ చేశారు. [more]
హైదరాబాదులో వలస కార్మికులు రోడ్డెక్కారు. టోలిచౌకి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వలస కార్మికులు రోడ్డు మీదకు వచ్చారు. తమ ను సొంత గ్రామాలకు పంపించాలని డిమాండ్ చేశారు. టోలిచౌకి చౌరస్తా మొత్తాన్ని కూడా వలస కార్మికులు బ్లాక్ చేశారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా తమను సొంత గ్రామాలకు పంపించడం లేదని ఆందోళనకు దిగారు. టోలిచౌకి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికులు ఇక్కడ ఉంటున్నారు. వీరంతా కూడా ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. ఊహించని రీతిలో కార్మికులందరూ రోడ్డుమీదికి రావడంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వలస కార్మికులకు నచ్చ చెప్పడానికి ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము అన్ని చక్క పెడుతున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వలస కార్మికులు విధి విధానాల ప్రకారమే వ్యవహరిస్తానని అధికారులు నచ్చచెప్పారు. తమను సొంత గ్రామాలకు పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తర్వాత మీ సమస్యలకు పరిష్కారం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రోడ్డుపై ఆందోళన చేస్తున్న వలస కార్మికులు తిరిగి వాళ్ళ షెల్టర్ హౌస్ కి వెళ్ళిపోయారు.