బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నెల్లూరుకు మంత్రి పార్థివదేహం
గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి స్పెషల్..
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి స్పెషల్ హెలికాఫ్టర్ లో నెల్లూరుకు పార్థివదేహాన్ని తరలించనున్నారు. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అందుకు తగిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఎయిర్ పోర్టు సిబ్బంది మంత్రి పార్థివదేహాన్నిచాపర్ లోకి ఎక్కించారు. అదే హెలికాఫ్టర్ లో మంత్రి తల్లి మణిమంజరి, భార్య శ్రీకీర్తి నెల్లూరుకు వెళ్లనున్నారు.
Also Read : తీవ్ర అస్వస్థతకు గురైన లాలూ ప్రసాద్
ఉదయం 11.15 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చాపర్ చేరుకోనుంది. 11.25గం.లకు డైకాస్ రోడ్డులోని జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి మేకపాటి పార్థివదేహాన్ని తరలిస్తారు. ఈరోజు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రజల సందర్శనార్థం మంత్రి క్యాంపు కార్యాలయంలోనే పార్థివదేహాన్ని ఉంచనున్నారు. యూఎస్ నుంచి మంత్రి కుమారుడు అర్జున్ బయల్దేరినట్లు తెలుస్తోంది. నేటిరాత్రి 11 గంటలకు అర్జున్ నెల్లూరుకు చేరుకోనున్నట్లు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో మంత్రి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.