ఓటర్ల జాబితాలో ఎన్నెన్ని మాయలో…

ఢిల్లీలో ఉండే ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్ కు హైదరాబాద్ లోని మోహదీపట్నంలో ఓటరు కార్డు ఉంది. ఇందులో తప్పేముంది.. ఓటు ఎక్కడైనా ఉండవచ్చు కదా [more]

Update: 2019-01-28 14:13 GMT

ఢిల్లీలో ఉండే ఎన్నికల ప్రధాన అధికారి ఓపీ రావత్ కు హైదరాబాద్ లోని మోహదీపట్నంలో ఓటరు కార్డు ఉంది. ఇందులో తప్పేముంది.. ఓటు ఎక్కడైనా ఉండవచ్చు కదా అనుకోగలరు.. ఇక్కడే అసలైన ఉంది తిరకాసు. ఢిల్లీలో ఉండే రావత్ కు హైదరబాద్ లో ఉన్నది నకిలీ ఓటర్ కార్డు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కూమార్ కు కూడా మోహదీపట్నంలో ఓటర్ కార్డు ఉంది. కానీ ఆయన ఉండేది జూబ్లీహిల్స్ లో. ఎన్నికల సిత్రాలపైన దృష్టి పెట్టిన రాజకీయ పార్టీలకు అధికారులు చేసిన తప్పులు బయట పడుతున్నాయి. ఓపీ రావత్ తో పాటు రజత్ కూమార్ లకు నకిలీ ఓటరు కార్డులు రావడంపైన రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాయి. కార్డులను జారీ చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు తప్పిదం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ విషయాన్ని సిరియస్ గా తీసుకుంది. నకిలీ ఓటర్ల జారీపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీసీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఓటరు కార్టులు కావాలని అన్ లైన్ ఇద్దరు అధికారుల పేర్లతో దరఖాస్తు పెట్టుకున్నారు.

జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో…

అన్ లైన్ లో జీహెచ్ఎంసీకి వచ్చిన దరఖాస్తులను అధికారులు ఎలాంటి పరిశీలన చేయలేదు. కనీసం దరఖాస్తు పెట్టిన వ్యక్తులు ఎవరు అని కూడా చూడలేదు. సదరు అడ్రస్ కు వెళ్లి పరిశీలించలేదు. ఎమీ చేయకుండానే ఇద్దరి పేర్లతో ఒటరు కార్డును జారీ చేశారు. అయితే కనీసం కార్డులను డెలివరీ చేసే ముందు కూడా అధికారులు సదరు ఇంటికి వెళ్లి సదరు వ్యక్తులు ఉన్నారా లేదా అని కూడా తనిఖీ చేయలేదు. ఏకంగా ఓపీ రావత్, రజత్ కూమార్ ల ఓటరు కార్డులను మోహదీపట్నంలో ఉన్న అడ్రస్ కు ఇచ్చి వచ్చారు. అయితే ఇందులో జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా కారణంగానే నకిలీ ఓటరు కార్డులు జారీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. సీసీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ముందుగా జీహెచ్ఎంసీ అధికారుల పాత్రపైన పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. ఎన్నికల అధికారుల పేర్లతో దరఖాస్తులు చేసిన వారిని గుర్తించి చర్యలు తసుకోనున్నారు.

Tags:    

Similar News