గ్రామీ అవార్డుకు ప్రధాని మోదీ పాట

ప్రధాని మోదీ స్వయంగా కలం, గళం కలిపిన ఓ పాట ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయింది. ఆర్నెళ్ల నెలల కిందట విడుదలైన ‘అబండన్స్‌ ఇన్‌ మిలెట్స్‌’ (తృణధాన్యాలలో అత్యుత్తమ పోషకాలు) అనే పాట 2024 గ్రామీ అవార్డుకు బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ పెర్‌పార్మెన్స్‌ కేటగిరీలో నామినేషన్‌ దక్కించుకుంది.

Update: 2023-11-11 02:55 GMT

ప్రధాని మోదీ స్వయంగా కలం, గళం కలిపిన ఓ పాట ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయింది. ఆర్నెళ్ల కిందట విడుదలైన ‘అబండన్స్‌ ఇన్‌ మిలెట్స్‌’ (తృణధాన్యాలలో అత్యుత్తమ పోషకాలు) అనే పాట 2024 గ్రామీ అవార్డుకు బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ పెర్‌పార్మెన్స్‌ కేటగిరీలో నామినేషన్‌ దక్కించుకుంది.

ఈ పాటను ఫాల్గుణి షా, గౌరవ్‌ షా అనే భార్యభర్తలు రచించగా, ప్రధాని మోదీ కూడా రచనా సహకారం అందించారు. తృణధాన్యాల విలువను తెలియజేస్తూ రూపొందించిన ఈ పాటకు కొటేషన్ల రూపంలో మోదీ తన వంతు సాయం అందించారు. ‘తృణధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం’ సందర్భంగా ఈ గీతాన్ని స్వరపరిచారు. ఈ ఏడాది ప్రదమార్థంలో ఫల్గుణి, గౌరవ్ జంట మోదీని కలిసినప్పుడు, దేశంలో ఆహార ధాన్యాల కొరత గురించి వారి మధ్య చర్చ జరిగింది. ప్రధాన ఆహార పంటలకు ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించాలని, దీనికోసం ఓ పాటను రూపొందించాలని ప్రధాని ఈ గాయక జంటకు సూచించారు.

గతంలో మోదీ కొన్ని పాటలు రాశారు. ఈ పాట విషయంలో కూడా తమకు సహకరించాలని వారు మోదీని అభ్యర్థించారు. దీనికి ప్రధాని కూడా సరే అంటూ, కొటేషన్స్ రాయడమే కాకుండా, వాటిని స్వయంగా పాట మధ్యలో ప్రస్తావించారు. అందమైన వీడియో కూడా ఈ పాటకు తోడవడంతో, యూట్యూబ్‌లో పాపులర్‌ అయింది. 2024 గ్రామీ అవార్డుకు ఈ పాట నామినేట్‌ కావడం విశేషం.

Tags:    

Similar News