చంద్రునిపై భూమి కొనవచ్చా...? ఏరోస్పేస్ నిపుణులు ఏమంటున్నారు?
ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని చంద్రునిపై ల్యాండింగ్ చేసి చరిత్ర పుటలో లిఖించింది. ప్రపంచ దేశాలు భారత్ వైపు..
ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని చంద్రునిపై ల్యాండింగ్ చేసి చరిత్ర పుటలో లిఖించింది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసింది. చంద్రునిపై ల్యాండ్ చేసిన నాలుగో దేశం భారత్ అవతరించింది. ఈ నెల 23న చంద్రునిపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 రోవర్ పరిశోధనలు మొదలు పెట్టింది. చంద్రునిపై మట్టిని పరిశీలిస్తోంది. చంద్రునిపై ఉన్న భూమి ఏ విధంగా ఉందనే విషయంపై ఆధ్యాయనం చేయనుంది. ఇక ఈ విషయాలన్ని అటుంచితే అసలు విషయానికొద్దాం.. చంద్రునిపై భూమి అమ్ముతున్నారని, కొందరు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారనే విషయంలో గతంలో చాలా మంది విని ఉంటారు. అయితే మీరేమైన చంద్రునిపై భూమి కొనాలని ప్లాన్ చేస్తున్నారా..?
చంద్రయాన్ 3 చంద్రుడిపైకి చేరినప్పటి నుంచి చంద్రుడి ఉపరితలంపై భూమిని కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. అయితే చంద్రుడిపై భూములు, ప్లాట్లు కొంటామంటూ పెద్ద ఎత్తున సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఇక్కడ భూములు కొంటారనే వాదనలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు చాలా తక్కువ ధరకు భూమి కొనుగోలు చేయవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. మరి నిజంగానే చంద్రునిపై భూమి కొనవచ్చా..? ఇది సాధ్యమయ్యే ననేనా..? ఇందులో వాస్తవాలు ఏమిటి? వాస్తవ తనిఖీ వెబ్‌సైట్‌లు, రక్షణ, ఏరోస్పేస్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రునిపై భూమి కొనుగోల చేయడం సాధ్యమయ్యే పనేనా అనే అంశం గురించి తెలుసుకుందాం.
డిఫెన్స్, ఏరోస్పేస్ నిపుణుడు గిరీష్ లింగన్న దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రునితో సహా బాహ్య అంతరిక్షాన్ని ఎవరూ కొనుగోలు చేయలేరని స్పష్టం చేస్తున్నారు. ఇది సాధ్యం కాని పని అని అంటున్నారు. 1967లో అమల్లోకి వచ్చిన ఒప్పందం అందరికీ ఉమ్మడి వారసత్వం అని స్పష్టం చేస్తున్నారు. ఎవరికీ ప్రైవేట్ ఆస్తి లేదు. చంద్రునిపై భూమిని కొనడం సాధ్యం కాదు. యజమాని లేనప్పుడు భూమిని ఎలా అమ్మాలి?
చంద్రుడితో సహా బాహ్య అంతరిక్షం ఎవరికీ లేదని, 1967లో అమల్లోకి వచ్చిన ఒప్పందం అందరికీ ఉమ్మడి వారసత్వం అని స్పష్టంగా పేర్కొంది. చట్టం ప్రకారం చంద్రునిపై భూమి కొనుగోలు చేయడం కుదరదని చెబుతున్నారు. 1967 అక్టోబరు 10న అమల్లోకి వచ్చిన ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం చంద్రుడు ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. ఇది సింబాలిక్ మార్క్ మాత్రమే. దీనికి చట్టపరమైన చెల్లుబాటు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.