Devaragattu : కర్రల సమరంలో రక్తపాతం…వందమందికి గాయాలు

దేవరగట్టు కర్రల సమరంలో దాదాపు వంద మందికి పైగానే తీవ్ర గాయాలపాలయ్యారు. దసరా రోజు కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో సంప్రదాయంగా వస్తున్న కర్రల సమరంలో రక్తం చిందింది. [more]

Update: 2021-10-16 01:48 GMT

దేవరగట్టు కర్రల సమరంలో దాదాపు వంద మందికి పైగానే తీవ్ర గాయాలపాలయ్యారు. దసరా రోజు కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో సంప్రదాయంగా వస్తున్న కర్రల సమరంలో రక్తం చిందింది. దాదాపు వంద మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మాళ మల్లేశ్వరస్వామి ని దక్కించుకునేందకు ఈ సమరం ప్రతి ఏటా దసరా రోజు ఈ ఉత్సవం జరుగుతుంది.

కోవిడ్ నిబంధనలు పెట్టినా….

బన్నీ ఉత్సవంగా పిలుచుకునే ఈ కర్రల సమరంలో వేలాదిమంది గ్రామస్థులు పాల్గొంటారు. కర్రలతో కొట్టుకుంటారు. ఇది తరతరాాలుగా వస్తున్న సంప్రదాయం కావడంతో పోలీసుల ఆంక్షలు కూడా ఇక్కడ పనిచేయవు. స్వామి మూర్తులను దక్కించుకోవడానికి ఈ సమరం జరుగుతుంది. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలను పెట్టినా భక్తులు వాటిని లెక్క చేయలేదు.

Tags:    

Similar News