నిద్రలోనే మృత్యువు ఒడిలోకి

టర్కీలో మరోసారి సంభవించిన భూకంపం కారణంగా వేల మందికి పైగా మరణించారని తెలిసింది.

Update: 2023-02-06 12:16 GMT

టర్కీలో మరోసారి సంభవించిన భూకంపం కారణంగా వేల మందికి పైగా మరణించారని తెలిసింది. 2,818 భవనాలు కుప్పకూలడంతో మృతుల సంఖ్య ఎంతనేది తేలడం లేదు. వేలల్లోనే మృతుల సంఖ్య ఉండవచ్చన్న అంచనాలు వినపడుతున్నాయి. పేకమేడల్లా పెద్ద పెద్ద భవనాలు కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతగా భూకంపం నమోదయింది. టర్కీలో 700, సిరియాలో 912 మంది ఇప్పటి వరకూ మరణించారు.

నిద్రలోనే ప్రాణాలు కోల్పోయి...
తొలుత నలభై ఐదు సెకన్ల పాటు కంపించిన భూమి ఆ తర్వాత వెంటనే మరో నిమిషం పాటు భూకంపం సంభవించింది. తరచూ టర్కీలో భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలడంతో ఆ శిధిలాల కింద ఎంతమంది ఉంటారన్నది అంచనాలకు అందడం లేదు. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. టర్కీ, సిరియాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేలల్లోనే మరణాలు సంభవించి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. శిధిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది.
ప్రపంచదేశాల సాయం...
టర్కీ, సిరియాలో భూకంప తీవ్రతకు జరిగిన నష్టం, సాయాన్ని అందించేందుకు రెండు దేశాలు ప్రపంచ దేశాల సాయాన్ని కోరాయి. భారత్ టర్కీకి ప్రత్యేకంగా సాయం అందించింది. డీఆర్ఎఫ్ బృందాలను టర్కీకి పంపింది. డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వైద్య బృందాలను, మెడిసిన్స్ కూడా పంపింది. నష్టం ఎంత ఉంటుందన్న అంచనా ఇంకా వేయలేకపోతున్నారు. భారీగా నష్టం వాటిల్లిందని మాత్రం ప్రాధమిక అంచనాను బట్టి తెలిసింది.


Tags:    

Similar News