ప్రేమ…. చంపించింది
చిన్న తనంలోనే ప్రేమ ఏంటి అంటూ తల్లి కూతురును మందలించింది. ప్రేమ వద్దన్నందుకు కన్న తల్లినే కడతేర్చింది ఓ కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి [more]
చిన్న తనంలోనే ప్రేమ ఏంటి అంటూ తల్లి కూతురును మందలించింది. ప్రేమ వద్దన్నందుకు కన్న తల్లినే కడతేర్చింది ఓ కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి [more]
చిన్న తనంలోనే ప్రేమ ఏంటి అంటూ తల్లి కూతురును మందలించింది. ప్రేమ వద్దన్నందుకు కన్న తల్లినే కడతేర్చింది ఓ కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. రామన్నపేటకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. కూతురు కీర్తి.. ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. కీర్తిని తల్లి రజిత మందలించింది.
మరో ప్రియుడితో……
దీంతో కట్టలు తెచ్చుకున్న కోపంతో కీర్తి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. తండ్రి లారీ డ్రైవర్‌గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు ఇంట్లోనే గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. తాను వైజాగ్ టూర్‌కు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకే ఉండే మరో ప్రియుడితో గడిపింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి.. కూతుర్ని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను చంపినట్లు కీర్తి అంగీకరించింది.