నమ్మిన వారికి పంగనామాలు పెట్టడమే బాబు నైజం
అన్నదమ్ముల్లా కలిసి ఉండే మాల, మాదిగల మధ్య తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏబీసీడీ వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడును దళితులంతా ఏకమై ఓడించాలని [more]
అన్నదమ్ముల్లా కలిసి ఉండే మాల, మాదిగల మధ్య తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏబీసీడీ వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడును దళితులంతా ఏకమై ఓడించాలని [more]
అన్నదమ్ముల్లా కలిసి ఉండే మాల, మాదిగల మధ్య తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏబీసీడీ వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడును దళితులంతా ఏకమై ఓడించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా దళిత, బీసీ, మైనారిటీలంతా ఏకం కావాలన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని కాంగ్రెస్ తో పొత్తు కలిపి ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. నమ్మినక వారికి పంగనామాలు పెట్టడమే చంద్రబాబు నైజమన్నారు. మోసానికి ఆయన మారుపేరన్నారు. ఇవాళ మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టినట్లే మిగతా కులాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం ఇచ్చే అధికారం చంద్రబాబుకు లేకున్నా మోసం చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ ను గెలిపించండి..!
బీసీలపై ప్రేమ అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు ఎందుకు పంపించలేదని, వందల కోట్లు తీసుకొని రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని అన్నారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని పేర్కొన్నారు. ఎస్సీలను, బీసీలను చంద్రబాబు తన పాలేర్లుగా చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు నైజాన్ని బీసీ, ఎస్సీ సోదరులు అర్థం చేసుకోవాలని కోరారు. 30 ఏళ్లుగా ప్రజల కోసం బతికిన వ్యక్తిగా చెబుతున్నానని… ఈ ఎన్నికల్లో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును ఓడించి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవాళ కేసీఆర్ ను తిడుతూ చంద్రబాబు సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని, అసలు తెలంగాణ ఏర్పడటానికి కారణమే చంద్రబాబు ఇచ్చిన లేఖ అని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని మోడీని కీర్తించిన చంద్రబాబు ఇప్పుడు రంగులు మార్చారని పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారని, చంద్రబాబు ఓడిపోవడం, జగన్ గెలవడం ఖాయమన్నారు. తిరుపతి వెంకన్నను కూడా ఇదే వేడుకున్నానని, చంద్రబాబు వంటి నమ్మకద్రోహి గెలవొద్దని అన్నారు.