Maa : అందరూ రాజీనామా… కొత్త కుంపటి పెట్టేసినట్లేనా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చలన చిత్ర పరిశ్రమలో చిచ్చును రేపాయి. ప్రకాష్ రాజ్ నేతృత్వంలో కొత్త అసోసియేషన్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్లే కనపడుతుంది. మా ఎన్నికల్లో [more]
;
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చలన చిత్ర పరిశ్రమలో చిచ్చును రేపాయి. ప్రకాష్ రాజ్ నేతృత్వంలో కొత్త అసోసియేషన్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్లే కనపడుతుంది. మా ఎన్నికల్లో [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చలన చిత్ర పరిశ్రమలో చిచ్చును రేపాయి. ప్రకాష్ రాజ్ నేతృత్వంలో కొత్త అసోసియేషన్ పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్లే కనపడుతుంది. మా ఎన్నికల్లో ఇటీవల గెలిచిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో 11 మంది రాజీనామా చేశారు. విష్ణు సక్రమంగా పనిచేయడానికి తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రతి సభ్యుడు మీడియాతో మాట్లాడారు. తాము విష్ణు నేతృత్వంలో పనిచేయలేమని చెప్పారు.
విష్ణుకు అడ్డురాకూడదనే…..
విష్ణు చలనచిత్ర పరిశ్రమకు మంచి చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. పోస్టల్ బ్యాలట్ నుంచే ఎన్నికల్లో అవకతవకలు మొదలయ్యాయని ప్రకాష్ రాజ్ అన్నారు. తాము ప్రశ్నించేతత్వం ఉన్నవారమని, తాము ప్రశ్నిస్తే గొడవలు అవుతాయని తాము ఈ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు సినీనటుడు శ్రీకాంత్ తెలిపారు. రెండు వర్గాలు కలసి పనిచేయడం కష్టమని ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని సభ్యులందరూ అభిప్రాయపడ్డారు. రెండేళ్లు విష్ణు బాగా పనిచేయాలని వాళ్లు ఆకాంక్షించారు.