బ్రేకింగ్: బోండా ఉమాపై హత్య కేసు నమోదు

విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఆయన కుమారుడు శివపై హత్య కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం తన కూతురు సాయిశ్రీ అనుమానాస్పదంగా మరణించిందని, ఆమె [more]

Update: 2019-04-09 10:56 GMT

విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఆయన కుమారుడు శివపై హత్య కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం తన కూతురు సాయిశ్రీ అనుమానాస్పదంగా మరణించిందని, ఆమె మృతికి బోండా ఉమా, ఆయన కుమారుడు శివ కారణమని సుమనశ్రీ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బోండా ఉమా, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు సైతం ప్రాణహాని ఉందని, బెదిరింపులు వస్తున్నాయని సుమనశ్రీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అయినా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని, సామాన్యులకు అన్యాయం చేసే బోండా ఉమా లాంటి వారిని ఎన్నుకోవద్దని సుమనశ్రీ ప్రజలను కోరారు. బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News