బాబాయే కాలయముడు

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి మండలం లో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల్లో తిన్న కేక్ విషపూరితం కావడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా [more]

Update: 2019-09-05 07:53 GMT

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి మండలం లో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల్లో తిన్న కేక్ విషపూరితం కావడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఐనాపూర్ గ్రామానికి చెందిన రాంచరణ్ బుధవారం రాత్రి జన్మదినాన్ని చేసుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ బాబాయి శ్రీనివాస్ కేకును పంపాడు. ఈ కేకును కోసిన రాం చరణ్ కుటుంబసభ్యులందరికీ పంచాడు. దీన్ని తిన్న రాంచరణ్, ఆయన తండ్రి రవి మృతిచెందారు. తల్లి భాగ్యలక్ష్మి, సోదరి పూజిత ల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేకు పంపించిన శ్రీనివాస్ కు, రాంచరణ్ తండ్రి రవికి మధ్య కొంతకాలంగా భూ వివాదాలుండడంతో నే శ్రీనివాస్ ఉద్దేశ్యపూర్వకంగా కేకులో విషపదార్థాలను కలిపి పంపించారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News