వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రినల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలోకిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని, జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. జగన్ అంతలా ఎందుకు నడుస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ కంటే వ్యక్తి ముఖ్యం కాదని, ప్రజల కంటే పార్టీ ముఖ్యం కాదని ఆయన అన్నారు.
చంద్రబాబు వైఫల్యం.....
మరోవైపు ఆయన చంద్రబాబు తీరును తప్పుపట్టడం గమనార్హం. విభజన హామీలను సాధించుకోవడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లు బీజేపీతో కలసి ఉండి ప్రధాన హామీలను కూడా సాధించుకోలేకపోవడం విచారకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం హామీలు అమలు చేశారని రాష్ట్రానికి వస్తారని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే విభజన హామీలు అమలవుతాయనిఆయన చెప్పారు.