ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పది అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి 11వతేదీ వరకూ జన్మభూమి -మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలకు విధిగా అందరూ హాజరవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. పది అంశాలపై శ్వేత పత్రాలను విడుదల చేసి దానిపై గ్రామాలు, వార్డు సభల్లో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు.
01. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు
02. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వృద్ధిరేటు
03. రైతుల సంక్షేమం
04. విద్యుత్ - ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
05. సాంఘిక సంక్షేమం సాధివకారత
06. మానవ వనరుల అభివృద్ధి
07. పరిశ్రమలు -ఉపాధి కల్పన
08. సుపరిపాలన
09. సహజవనరుల నిర్వహణ
10. గ్రామాలు-పట్టణాల్లో మౌలిక వసతులు