డేటా చోరీ కేసు ఏపీకి బదిలీ చేయాలని తెలియదా

డేటా చోరీ వ్యవహారంపై మరోసారి మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్, వైసీపీపై ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ మాటలతో కేసీఆర్, జగన్ మధ్య జోడీ బయటపడిందని [more]

Update: 2019-03-04 13:13 GMT

డేటా చోరీ వ్యవహారంపై మరోసారి మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్, వైసీపీపై ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ మాటలతో కేసీఆర్, జగన్ మధ్య జోడీ బయటపడిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రొడక్షన్ లో టీఆర్ఎస్ డైరెక్షన్ లో టీడీపీ సభ్యత్వం, డేటాను దొంగలించారని ఆరోపించారు. డేటా చోరీ చరిత్ర వైసీపీదేనని, తమది బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ అన్నారు. ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రావడం లేదని, ఏపీకి చెందిన డేటా పోయిందని ఫిర్యాదు వస్తే కేసు ఏపీకి బదిలీ చేయాలని కూడా తెలియదా అని ప్రశ్నించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక ఏపీలో బలహీన ముఖ్యమంత్రి ఉంటే టీఆర్ఎస్ ఆటలు సాగుతాయని కుట్ర చేస్తున్నారని అన్నారు. జగన్ కు ఏపీ ప్రతిపక్ష నేతగా జీతం కావాలని, పోలీసుల రక్షణ కావాలని, ఓట్లు కావాలి కానీ ఏపీ పోలీసులు, డాక్టర్లు, అధికారులు, ప్రజలపై నమ్మకం మాత్రం లేదన్నారు. అందుకే టీఆర్ఎస్ సహకారంతో తెలంగాణలో ఉంటే ఏపీలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

Tags:    

Similar News