పంతానికి పోతే….ఫలితం అనుభవిస్తారు

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మొండిపట్టుదలకు పోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందేనన్నారు. ప్రధాని మోదీ సయితం [more]

Update: 2021-06-23 05:44 GMT

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మొండిపట్టుదలకు పోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాల్సిందేనన్నారు. ప్రధాని మోదీ సయితం కరోనా విపత్తును దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేశారని, అనేక రాష్ట్రాలు కూడా అదే బాటన పయనించాయని లోకేష్ అన్నారు. పరీక్షలపై అంత మొండిపట్టుదల ఎందుకు అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ రోజుకు నాలుగువేల కేసులు నమోదవుతుండటాన్ని లోకేష్ గుర్తు చేశారు. విద్యాశాఖమంత్రి ప్రకటనలో విద్యార్థులు ఆందోళనకు, వత్తిడికి గురవుతున్నారని నారా లోకేష్ అన్నారు. పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని లోకేష్ అన్నారు. ఇప్పటికైనా పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News