ఇలా అరెస్ట్ చేసుకుంటూ వెళతారా?

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. టీడీపీ నేతలను, సానుభూతి పరులను అరెస్ట్ [more]

Update: 2020-06-23 06:24 GMT

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. టీడీపీ నేతలను, సానుభూతి పరులను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అనేక స్కాం లకు పాల్పడుతున్నా అరెస్ట్ చేయరని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేయడమేంటని నిలదీశారు. టీడీపీ సానుభూతి పరులు నందకిషోర్, కృష్ణ అరెస్ట్ లపై నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తున్నారని, ఆ హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై విమర్శలుచేస్తున్నారని వారిని కూడా అరెస్ట్ చేస్తారా? అని అన్నారు. ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News