తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ ఆయన ఫొటోలు పెట్టుకుని ఊరేగుతున్నారంటే వీళ్లు ఎటు పోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పరోక్షంగా వైఎస్ జగన్, పవన్ లపై ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు అడ్డం పడితే ఆయన గెలిస్తే ఇక్కడ వీళ్లు సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇక్కడ విపక్షాలు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలను తాకట్టు పెడుతున్నారన్నారు.
విపక్షాలను తరిమికొట్టాలి.....
రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ ప్రతి ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటునే ఈ విపక్షాలను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలన్నారు. ఎంతో కష్టపడి పరిపాలనను ట్రాక్ లో పెట్టామన్నారు. ఐదారునెలలు కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇది పరీక్షా సమయం. రాబోయే రాజుల్లో అన్ని రాష్ట్రాలకంటే ముందుండాలంటే కుట్రలను ఎదుర్కొనాలన్నారు.