తాను జాతీయ స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లి లో జరుగుతున్న జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పరిమితమవ్వడం భావ్యం కాదని, దేశం కోసం పనిచేయాల్సి ఉందని ఆయన అన్నారు. దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ లో తాను అన్ని వసతులు కల్పించారన్నారు. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లను నిర్మించినందునే రాష్ట్ర విభజన జరిగినా ఇక్కడకు ఎవరూ రావడం లేదన్నారు. అక్కడ వసతులు ఉన్నందునే ఇక్కడకు రావడం లేదన్నారు. ఏపీలో కూడా అన్ని వసతులను కల్పిస్తే అందరూ అమరావతికి వచ్చేందుకు సిద్ధపడతారన్నారు. పోలవరాన్ని జాతీయ పార్టీగా గుర్తించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.