తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బాబు తప్పుడు ప్రచారం
విశాఖకు రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను ఎన్డీఏ నిజం చేసిందని, రైల్వే జోన్ వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని [more]
విశాఖకు రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను ఎన్డీఏ నిజం చేసిందని, రైల్వే జోన్ వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని [more]
విశాఖకు రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను ఎన్డీఏ నిజం చేసిందని, రైల్వే జోన్ వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ఈ ప్రాంతం కోసం అనేక హామీలు నెరవేర్చామన్నారు. మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
– తాము ఇవాళ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామంటే మాకు ఎటువంటి భయం లేదు. మా ఫైళ్లు తెరుస్తారనో, అవినీతి కేసులు తెరుస్తారనో మాకు భయం లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు భయం లేదు. కానీ ఇక్కడి నాయకుడు వారి అవినీతి, కుటుంబ పాలన ద్వారా చేసిన తప్పుల గురించి భయపడుతున్నారు. వారు తప్పు చేసినందుకే భయపడుతున్నారు.
– ఏ నేత కూడా ఇంతవరకు తీసుకోనన్ని యూటర్న్ లు తీసుకున్న నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేయగలరు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని, ఉనికిని దెబ్బతీసిన కాంగ్రెస్ తో యూటర్న్ నాయకులు జతకట్టారు.
– ఈ కూటమి కట్టిన నాయకులకు ఎటువంటి ఎజెండా లేదు. దేశంలో పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నందునే, నల్లదనం దాచుకున్న వారికి గుణపాఠం చెబుతున్నందునే వారు నన్ను గద్దె దించేందుకు కూటమి కట్టారు.
– భావసారుపత్య లేని మహా కూటమిని, కుటిల కూటమిని దేశప్రజలంతా గుర్తించారు. ఒకరితో ఒకరికి పడని ఈ మహాకూటమి ఒక బలహీన ప్రభుత్వాన్ని మాత్రమే ఇస్తుంది. ఇప్పుడున్న తమ బలమైన ప్రభుత్వం దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగలదు.
– ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పాకిస్తాన్ ను నిందిస్తూ ఉంటే మన దేశంలోని కొందరు నేతలు మాత్రం పాక్ ను సమర్ధిస్తూ మాట్లాడుతూ సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. వీరి మాటలను పాకిస్తాన్ నాయకులు అక్కడి పార్లమెంటులో లేవనెత్తుతున్నారంటే వీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు గుర్తించాలి.
– మోడీని వ్యతిరేకించే క్రమంలో మహాకూటమి నేతలు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
– సమర్థ ప్రభుత్వం ఉన్నప్పుడే దేశంతో పాటు సైనికులు, రైతులు సురక్షితంగా ఉంటారని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. రైతుల ప్రగతి కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చాం.
– తీరప్రాంత అభివృద్ధికి, మత్య్సకారుల కోసం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయనంతగా ఎన్డీఏ సర్కార్ చేసింది. నీలి విప్లవాన్ని తీసుకువచ్చి మత్య్సకారులకు కేంద్రం సహకారం అందిస్తోంది.