‘మిషన్ శక్తి’ విజయవంతం

అంతరిక్షరంగంలో భారత్ సత్తా చాటిందని, స్పేస్ పవర్ గా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ… ప్రపంచంలో స్పేస్ పవర్ గా [more]

Update: 2019-03-27 07:43 GMT

అంతరిక్షరంగంలో భారత్ సత్తా చాటిందని, స్పేస్ పవర్ గా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. బుధవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ… ప్రపంచంలో స్పేస్ పవర్ గా మారిన నాలుగో దేశం భారత్ అని పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కాలం చెల్లిన శాటిలైట్ ను కూల్చివేశారని ప్రకటించారు. ‘మిషన్ శక్తి’ పేరుతో చేసిన అత్యంత కఠినమైన ఈ ఆపరేషన్ ను భారత్ విజయంవంతంగా పూర్తి చేసిందన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇండియా స్పేస్ పవర్ గా ఎదిగిందని ఆయన ప్రకటించారు. ఈ విజయంతో భారత్ మరింత సురక్షితంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని భారత్ కోరుకుంటోందని, యుద్ధ వాతావరణ ఏర్పడటం తమ ఉద్దేశ్యం కాదన్నారు.

Tags:    

Similar News