అయోధ్యపై మోదీ ఏమన్నారంటే…?

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థలోనే చారిత్రాత్మకమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమన్నారు మోదీ. భారత్ [more]

Update: 2019-11-09 12:47 GMT

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థలోనే చారిత్రాత్మకమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమన్నారు మోదీ. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. దశాబ్దాలుగా ఉన్న కేసుకు ముగింపు లభించిందన్నారు. ప్రజాస్వామ్య శక్తిని నిరూపించిన రోజు ఇది అని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలంతా శాంతి, ఐకమత్యంతో ఉండాలని నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. సంక్లిష్టమైన సమస్యనైనా న్యాయబద్దంగా పరిష్కరించవచ్చని ఈ తీర్పు చెప్పిందన్నారు. ఈరోజు పరిణామాలు దేశ ఐక్యతకు నిదర్శనమని నరేంద్ర మోదీ చెప్పారు. భారత న్యాయవ్యవస్థకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో గెలుపోటములను ఎవరూ చూడొద్దని నరేంద్ర మోదీ చెప్పారు. న్యూ ఇండియా నిర్మాణానికి ఇది మెట్టుమాత్రమేనని చెప్పారు.

Tags:    

Similar News