ఆన్ లైన్ బెట్టింగ్ పై రంగంలోకి దిగిన ఎన్ఐఏ

ఆన్ లైైన్ బెట్టింగ్ ఆపైన ఎన్ఐఏ నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా అక్రమంగా కొనసాగుతున్న ఆన్ లైైన్ బెట్టింగ్ పైన సిటీ సిసి ఎస్ పోలీసులు కేసు నమోదు [more]

Update: 2020-09-21 02:58 GMT

ఆన్ లైైన్ బెట్టింగ్ ఆపైన ఎన్ఐఏ నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా అక్రమంగా కొనసాగుతున్న ఆన్ లైైన్ బెట్టింగ్ పైన సిటీ సిసి ఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్ల కొడుతున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ఈడి సైతం రంగంలోకి దిగింది.. 1,100 కోట్ల రూపాయలను అక్రమంగా దేశ ప్రజల నుంచి కాజేసిన చేసిన చైనా కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఆన్లైన్ బెట్టింగ్ స్కాంపై తాజాగా ఎన్ఐఏ విచారణ మొదలు పెట్టింది.

హైదరాబాద్ కేంద్రంగా…..

హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఆన్ లైైన్ బెట్టింగ్ స్కాం పైన ఈడితో పాటు తాజాగా ఏన్ ఐ ఏ కూడా దృష్టి పెట్టింది.. ఇందుకు సంబంధించి సిసిఎస్ తో పాటు హైదరాబాద్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక కేసు నమోదు చేసింది.. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇందుకోసం ప్రత్యేకమైన టీమ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆన్ లైైన్ లో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి.. ముఖ్యంగా కలర్ ప్రొటెక్షన్ పేరుతో ఈ గేమ్స్ ఏర్పాటు చేశారు.. ముందుగా చిన్న చిన్న మొత్తంలో డబ్బులు కట్టుకొని తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొడుతున్నారు.. దీనికి సంబంధించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది..

చైనాకు బదిలీ…
ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే ఆన్ లైైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లకకొడుతున్న విషయం అధికారుల విచారణలో బయట పడింది.. ఇందుకు సంబంధించి ఒక చైనీస్ తో పాటు ఇద్దరు భారతీయులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. అయితే దాదాపుగా 11 వందల కోట్ల రూపాయలను ఒక్క మూడు నెలల్లోనే చైనా కి బదిలీ చేసినట్టుగా తేలింది.. ఇండియాలో ఉన్న పలు కంపెనీల పేర్లమీద డబ్బుల్ని అక్రమంగా చైనా కు బదులు చేసినట్టుగా వెలుగు చూసింది. దీంతో కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా దొడ్డిదారిన విదేశాలకు డబ్బులు బదిలీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై కేసును వెంటనే నమోదు చేయాలని ఈడి కి ఆదేశించింది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెంటనే రంగంలోకి దిగింది. ఇక దీనిపై ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ మొదలు పెట్టడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనివెనక….

చైనాకు చెందిన బీజింగ్ టీ కంపెనీ నీ ఈ వ్యవహారం వెనకాల ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇండియాలో ఉన్న పేమెంటు గేట్ వే లు డబ్బులు అక్రమంగా చైనాకు తరలి వెళ్ళిందుకు సహాయం చేసినట్లు గుర్తించింది. ముఖ్యంగా పేటీఎం లాంటి సంస్థలు చైనా కంపెనీ కోసం పని చేసినట్లుగా తెలిసింది. ఇందుకు గాను పేటీఎం సంస్థకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆన్లైన్ బెట్టింగ్ సంస్థలకు పేటీఎం కోసం ఎందుకు పని చేశారని సీసీఎస్ ప్రశ్నించింది. ఇక ప్లే స్టోర్ నుండి పేటిఎం ని కూడా తొలగించివేశారు. చైనా టీ కంపెనీ మొత్తం 100 వెబ్ సైట్లను తయారు చేసింది. అన్ని వెబ్ సైట్ లు కూడా ఒకే తరహాలో ఉంటాయి.. ముఖ్యంగా కొనుగోలు అమ్మకాలు చేసే సోషల్ సైట్స్ మాదిరిగా వెబ్ సైట్ డిజైన్ చేశారు.. ఇందులో కి వెళ్తే ఎలాంటి కొనుగోలు అమ్మకాలు చేయకపోయినా అందులో ఆన్ లైైన్ గేమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనికి క్లిక్ చేస్తే కలర్ ప్రొడక్షన్ గేమ్ ప్రత్యక్షమవుతుంది. ఒక్కసారి కలర్ ప్రొడక్షన్ లోకి వెళ్తే తిరిగి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈడి రంగంలో దిగి కేసు వివరాలని హైదరాబాద్ పోలీసుల నుంచి తీసుకుంది.. అదికాక నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతుంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. తాజాగా ఎన్ఐఏ దీని వెనుక ఎవరు వున్నారు. వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

Tags:    

Similar News