వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్

వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కూతురు సునీత హైకోర్టులో [more]

Update: 2020-01-28 04:45 GMT

వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కూతురు సునీత హైకోర్టులో పిటీషన్ వేశారు. వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత సునీత సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ డిమాండ్ ను సునీత పక్కన పెట్టారు. అయితే ఏడు నెలల నుంచి వైఎస్ వివేకా హత్య కేసును తన సోదరుడు జగన్ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోవడతో సునీత సీబీఐకి అప్పగించమని హైకోర్టును ఆశ్రయించడం విశేషం. ఇప్పటికే వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటీషన్లు వేశారు. అన్ని పిటీషన్లను ఒకేసారి హైకోర్టు విచారణ చేయనుంది.

Tags:    

Similar News