తెలంగాణలో కొత్త జోన్ల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. నూతన జోన్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. ఇందుకోసం కేసీఆర్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ కొత్త జోన్ల ఏర్పాటు ప్రక్రియ ముందే పూర్తికావాలని భావించారు. తెలంగాణలో 7 జోన్లు, 2 మల్టీజోన్లకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఇవాళ గెజిట్ విడుదల చేశారు.
నూతన జోన్లు
జోన్ 1(కాళశ్వరం) : అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి
జోన్ 2(బాసర) : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
జోన్ 3(రాజన్న సిరిసిల్ల) : కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి
జోన్ 4(భద్రాద్రి) : కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
జోన్ 5(యాదాద్రి) : సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం, యాదాద్రి
జోన్ 6(చార్మినార్) : మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి
జోన్ 7(జోగులాంబ) : వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్