జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ నోటీసులు

ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ ధర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదో రోజు నిందితుడు శ్రీనివాసరావును విచారిస్తోంది. న్యాయవాది సమక్షంలో శ్రీనివాసరావును హైదరాబాద్ లో ఎన్ఐఏ [more]

Update: 2019-01-16 06:49 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ ధర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదో రోజు నిందితుడు శ్రీనివాసరావును విచారిస్తోంది. న్యాయవాది సమక్షంలో శ్రీనివాసరావును హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా శ్రీనివాసరావు రాసిన లేఖపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇవాళ లేఖ రాయడానికి శ్రీనివాసరావుకి సహకరించిన మహిళను కూడా విచారించనున్నారు. దీంతో పాటు శ్రీనివాసరావు పనిచేసిన క్యాంటీన్ యాజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరితో పాటు, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న పలువురికి ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. వారి నుంచి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనున్నారు.

Tags:    

Similar News