నిమ్మగడ్డ యాప్ పై జగన్ సర్కార్ కోర్టుకు?

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందిస్తున్న ఎన్నికల యాప్ పై ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉంది. ఎన్నికల కమిషన్ రూపొందిస్తున్న యాప్ పై [more]

Update: 2021-02-02 08:54 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందిస్తున్న ఎన్నికల యాప్ పై ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉంది. ఎన్నికల కమిషన్ రూపొందిస్తున్న యాప్ పై వైసీపీతో పాటు బీజేపీ కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఆ యాప్ ఎక్కడ రూపొందించారో చెప్పాలంటూ అడిగినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంతవరకూ స్పందించలేదు. ఇది టీడీపీ కార్యాలయంలో రూపొందించిన యాప్ అని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయంగా ఒకరికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ యాప్ ను తెస్తున్నారని ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది.

Tags:    

Similar News