ఈ వాచ్ యాప్ ను ప్రారంభించిన నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ ను ఆవిష్కరించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు [more]

Update: 2021-02-03 05:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ ను ఆవిష్కరించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఎవరైనా ఎక్కడినుంచైనా ఈ యాప్ ద్వారా ఎన్నికల కమిషనర్ కు ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి కాలపరిమితిని కూడా విధించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫొటోలతో పాటు ఫిర్యాదులను కూడా ఈ యాప్ ద్వారా ఎస్ఈసీకి పంపవచ్చు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించడం, మద్యం, డబ్బుల పంపిణీ వంటి వాటిపై ఎవరైనా ఎక్కడినుంచైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Tags:    

Similar News