ప్రజల్లో ధైర్యం నింపేందుకే పర్యటనలు చేస్తున్నా

చిత్తూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకే తాను జిల్లాల పర్యటన చేస్తున్నట్లు నిమ్మగడ్డ [more]

Update: 2021-02-04 01:26 GMT

చిత్తూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకే తాను జిల్లాల పర్యటన చేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాలకు వెళ్లి తాను సమీక్షలు జరుపుతానని ఆయన చెప్పారు. ఏకగ్రీవాలు ఎక్కువ సంఖ్యలో కావని, ప్రజలు ఎక్కువగా ఎన్నికలలో పోటీ పడుతుండటమే ఇందుకు కారణమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన తాను పదవీ విరమణ చేస్తానని ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే తన లక్ష్యమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించారు.

Tags:    

Similar News