బ్రేకింగ్ : నిమ్మగడ్డకు హైకోర్టు షాక్…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ – వాచ్ యాప్ ను ఈ నెల 9వ తేదీ వరకూ [more]

Update: 2021-02-05 08:28 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ – వాచ్ యాప్ ను ఈ నెల 9వ తేదీ వరకూ అమల్లోకి తేవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 3వ తేదీన ఈ వాచ్ యాప్ ను అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ యాప్ లు ఉండగా ఎస్ఈసీ సొంత యాప్ ను తీసుకురావడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. యాప్ కు భద్రతా ధ్రువపత్రం లేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. అయితే ఈ ఐదు రోజుల్లో యాప్ కు ధ్రువపత్రాన్ని కోర్టుకు సమర్పిస్తామని ఎస్ఈసీ తరుపున న్యాయవాది తెలిపారు

Tags:    

Similar News