బిగ్ బ్రేకింగ్ : నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు.. పెద్దిరెడ్డిపై?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకూ ఇంటికే పరిమితం చేయాలని [more]

Update: 2021-02-06 07:18 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకూ ఇంటికే పరిమితం చేయాలని ఆదేశించారు. మీడియాతో కూడా పెద్దిరెడ్డిని మాట్లాడనివ్వకుండా కట్టడి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డకు సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి వైద్య సౌకర్యాల కోసమే బయటకు వెళ్లాలని, అప్పుడు కూడా మీడియాతో మాట్లాడకుండా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

Tags:    

Similar News