సెలవును రద్దు చేసుకున్న నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సెలవును రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 17 నుంచి 24వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]

Update: 2021-03-13 01:06 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సెలవును రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 17 నుంచి 24వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవుపై వెళ్లాలనుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు చేయాలని భావించారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సెలవును రద్దు చేసుకున్నారు. ఈనెల 18వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ల ఎన్నికలు జరుగుతుండటంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సెలవును రద్దు చేసుకున్నారని తెలిసింది. ఈ నెల 31వ తేదీతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియనుంది.

Tags:    

Similar News