నిమ్మగడ్డ కు నోటీసులు … విచారణకు హాజరు కావాల్సిందే
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. నిన్న సమావేశమయిన ప్రివిలేజ్ కమిటీ ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. నిన్న సమావేశమయిన ప్రివిలేజ్ కమిటీ ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయింది. నిన్న సమావేశమయిన ప్రివిలేజ్ కమిటీ ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపైనే చర్చించింది. రూల్ నెంబరు 212, 213 కింద ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విచారణ చేయాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు పంపుతున్నట్లు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. పదవిలో ఉన్నా, లేకున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాజరు కావాల్సి ఉంటుందని గోవర్థన్ రెడ్డి తెలిపారు. నేడు అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేయనున్నారు. ప్రివిలేజ్ కమిటీకి అందుబాటులో ఉండాలని పేర్కొననున్నారు.